NEWSTELANGANA

ప‌రిగిలో లో ఫ్రీక్వెన్సీ రాడ‌ర్ స్టేష‌న్

Share it with your family & friends

ఏర్పాటు చేస్తామ‌న్న సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ ముఖ్య‌మంత్రి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గం దామ‌గుండం దేవాల‌య ప్రాంతంలో ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంటి హాని క‌ల‌గ‌కుండా ఇండియ‌న్ నేవీ ప్రాజెక్టులో భాగంగా లో ఫ్రీక్వెన్సీ రాడ‌ర్ స్టేష‌న్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించిన ప‌నులు త్వ‌ర‌లో ప్రారంభం కానున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

అంతే కాకుండా ఇదే స్థ‌లంలో దేవాల‌యాన్ని అభివృద్ది చేస్తామ‌న్నారు. అంత‌కు ముందు నేవీ క‌మాండ‌ర్ కార్తీక్ శంక‌ర్ , ఎమ్మెల్యే రామ్మోహ‌న్ రెడ్డి గురువారం డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో సీఎం ను క‌లిశారు. నేవీ క‌మాండ‌ర్ లో ఫ్రీక్వెన్సీ రాడ‌ర్ స్టేష‌న్ గురించి రేవంత్ రెడ్డికి వివ‌రించారు.

నావికా దళానికి చెందిన భారీ పరికరాలను ఇక్కడ నిర్మిస్తారని, దీని ఏర్పాటు వల్ల పరిగి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నేవి కమాండర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిని నేవి అధికారులతో సమన్వయం చేసుకొని పనులు త్వరలో ప్రారంభించాలని రేవంత్ రెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో కల్నల్ హిమవంత్ రెడ్డి, నేవీ సిబ్బంది సందీప్ దాస్, రాజ్ బీర్ సింగ్, మణిశర్మ, మనోజ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.