పవన్ కళ్యాణ్ వైరల్
ఘణంగా కనుమ పండుగ
హైదరాబాద్ – ప్రముఖ నటుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేస్తూ వార్తల్లో ఉంటారు. ప్రస్తుతం ఆయన ఏపీ రాజకీయాలలో బిజీగా మారారు. తాజాగా సంక్రాంతి పండుగ సందర్బంగా ఆవులతో ఆయన కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన వద్దకు ఏకంగా పుంగనూరుకు చెందిన గోవులను తెప్పించుకున్నారు. వాటితో చాలా సేపు గడిపారు. వాటిని అనునయిస్తూ గడ్డి తినిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేశాయి.
సేమ్ టు సేమ్ సీన్ పవన్ కళ్యాణ్ విషయంలో రిపీట్ అయ్యింది. ఇందుకు కారణం లేక పోలేదు. ప్రస్తుతం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బేషరతుగా మద్దతు ఇస్తున్నారు. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్లనున్నారు.
ఈ తరుణంలో హైదరాబాద్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో పెంచుకున్న ఆవులకు గ్రాసాన్ని తినిపిస్తూ కనిపించారు. ఏది ఏమైనా సామాజిక సేవలోనే కాదు సాటి జంతువుల పట్ల కూడా పవన్ కళ్యాణ్ కు ప్రేమ ఉందని తేటతెల్లమైంది.