ANDHRA PRADESHNEWS

ప‌వ‌న్ కు ప‌ర్మిష‌న్ ఎలా ఇచ్చారు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన విజ‌య సాయి రెడ్డి

విజ‌య‌వాడ – వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగ‌ళ‌వారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ఆధ్వ‌ర్యంలో ఎన్నిక‌ల బృందంతో రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీల నేత‌లు హాజ‌ర‌య్యారు. తెలుగుదేశం పార్టీ జాతీయ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, వైసీపీ నుంచి విజ‌య సాయి రెడ్డితో పాటు విప‌క్షాలు, ఇత‌ర పార్టీల‌కు చెందిన అధిప‌తులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా సీఈసీని క‌లిశారు విజ‌య సాయి రెడ్డి. మొత్తం ఆరు అంశాల‌కు సంబంధించి పూర్తి నివేదిక‌ను అంద‌జేయ‌డం జ‌రిగింద‌న్నారు. మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్ పై నిప్పులు చెరిగారు. జ‌న‌సేన పార్టీకి గుర్తింపు లేకున్నా ఎందుకు ఆహ్వానించార‌ని సీఈసీని నిల‌దీశారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి.

అయితే తెలుగుదేశం పార్టీతో జ‌న‌సేన పార్టీ పొత్తు పెట్టుకుంద‌ని , అందుకే ఆ పార్టీ అధినేత‌ను కూడా రావాల‌ని ఆహ్వానం పంపామ‌ని వెల్ల‌డించారు. గ్లాస్ గుర్తు సాధార‌ణ గుర్తు అని, ఇలాంటి గుర్తు క‌లిగిన పార్టీ కొన్ని స్థానాలలో పోటీ చేయ‌డం అనేది పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌ని పేర్కొన్నారు.

రెడ్ బుక్ పేరుతో ఐఏఎస్ లు, ఐపీఎస్ ల‌ను టార్గెట్ చేస్తూ నోరు పారేసుకుంటున్నాడంటూ నారా లోకేష్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు విజ‌య సాయి రెడ్డి. ఇదే విష‌యాన్ని ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకు వెళ్లిన‌ట్లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో ఇటు ఏపీ అటు తెలంగాణ‌లో ఒకేసారి లోక్ స‌భ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరామ‌న్నారు ఎంపీ.