పవన్ తో ఎంపీ బాల శౌరి భేటీ
మర్యాద పూర్వకంగా కలిశా
అమరావతి – ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు శరవేగంగా మారుతున్నాయి. అధికార పార్టీకి కీలక నేతలు దూరంగా ఉంటున్నారు. మరికొందరు టికెట్లు రాని వాళ్లు పక్క చూపులు చూస్తున్నారు. ఇంకొందరు ఏకంగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను కలుసుకుంటున్నారు.
తాజాగా జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ వల్లభనేని బాల శౌరి జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఆయనతో పాటు తనయుడు కూడా ఉన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటానని, కానీ ఎప్పుడు చేరుతాననే విషయం ఇప్పుడే చెప్పలేనంటూ పేర్కొన్నారు ఎంపీ. ప్రస్తుతం ఆయన లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవన్నారు.
ఇదిలా ఉండగా ఎంపీ బాల శౌరి కీలకమైన నాయకుడిగా ఉన్నారు. ఉన్నట్టుండి ఆయన పార్టీ మారడం వెనుక ఏమై ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తనకు సీటు రాదేమోనన్న బెంగతో జనసేన వైపు చూసినట్లు సమాచారం.