ANDHRA PRADESHNEWS

ప‌వ‌ర్ లోకి వ‌స్తే యువ‌త‌కు భ‌రోసా

Share it with your family & friends


స్ప‌ష్టం చేసిన నారా లోకేష్

అమ‌రావ‌తి – తాము గ‌నుక అధికారంలోకి వ‌స్తే యువ‌తీ యువ‌కుల‌కు పూర్తి భ‌రోసాతో కూడిన ఉపాధి క‌ల్పిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్. ఆదివారం ఆయ‌న త‌న స‌తీమ‌ణి, త‌ల్లితో క‌లిసి మంగ‌ళ‌గిరి ఆల‌యాన్ని సంద‌ర్శించారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడారు. యువ గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్బంగా ప్ర‌జ‌ల నుంచి అద్భుత‌మైన ఆద‌ర‌ణ ల‌భించింద‌న్నారు. రాష్ట్రంలో జ‌గ‌న్ రెడ్డి పాల‌న దారుణంగా త‌యారైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు నారా లోకేష్.

పెంచిన ప‌న్నుల కార‌ణంగా రాష్ట్రంలోని లారీ య‌జ‌మానులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఇక్క‌ట్ల‌కు గుర‌వుతున్నార‌ని తెలిపారు . ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువ‌త తీవ్ర నిరాశ‌లో ఉంద‌న్నారు. ఎక్క‌డికి వెళ్లినా జాబ్స్ లేవ‌ని వాపోయార‌ని ఈ విష‌యం తన దృష్టికి వ‌చ్చింద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో త‌మ పాల‌సీ ఒక్క‌టే ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేయ‌డం. ప్ర‌ధానంగా డ్ర‌గ్స్ మహ‌మ్మారి బారిన ప‌డి త‌మ విలువైన జీవితాన్ని నాశ‌నం చేసుకుంటున్నార‌ని దీనిపై ఎక్కువ‌గా దృష్టి సారిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్.