పాతి పెట్టడం సరే హామీల మాటేంటి
నిప్పులు చెరిగిన కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ ను 100 మీటర్ల మేర పాతి పెడతానంటూ ప్రగల్భాలు పలకడం మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే దానిపై ఫోకస్ పెట్టాలని అన్నారు మంత్రి కేటీఆర్. శనివారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు కేటీఆర్.
లండన్ లో సంచలన కామెంట్స్ చేసిన రేవంత్ ను ఏకి పారేశారు. అధికారం ఉందనే మదంతో మాట్లాడటం మానుకోవాలని అన్నారు. జనం తమకు కూడా ఓట్లు వేసి గెలిపించారన్న సంగతి తెలుసుకుంటే మంచిదని సూచించారు.
ముందు వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీల కథ చూడంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. రేవంత్ లాంటి నాయకులను తమ పార్టీ ఎందరినో చూసిందన్నారు. తెలంగాణ జెండాను పాతి పెట్టే మొనగాడు ఇంకా పుట్ట లేదన్నారు.
ఒకసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. రాజకీయాలు చేయడం మంచిదే కానీ వ్యక్తిగత విమర్శలకు తావు ఉండ కూడదన్నారు. తాము చేసిన అభివృద్ది ఏమిటో చూపించేందుకు తాము సిద్దంగా ఉన్నామని సవాల్ విసిరారు కేటీఆర్.
ఇంకోసారి ఇలాంటి అహంకార పూరిత మాటలు మాట్లాడితే గులాబీ నేతలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.