పాపాల పుట్టకు కేరాఫ్ కాంగ్రెస్
హిమంత బిస్వా శర్మ
భువనేశ్వర్ – అసోం సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఈ దేశాన్ని పాలించిన కాలమంతా అవినీతి అక్రమాలతో పాటు పాపాలు చేసిందంటూ మండిపడ్డారు.
ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ జీవితాంతం అభివృద్ది పేరుతో మోసం చేసిందన్నారు. సీఎం హిమంత బిస్వా శర్మ మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ మందిరం పునః ప్రతిష్ట చేస్తున్న ఈ అరుదైన క్రమంలో కాంగ్రెస్ పాల్గొనక పోవడం దారుణమన్నారు.
ఓ వైపు కోట్లాది మంది ప్రజలు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కేంద్ర సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. అయితే ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ తాము హాజరు కాలేమంటూ చెప్పడం వారి అసలైన నిజాన్ని తెలియ చేస్తుందన్నారు సీఎం హిమంత బిస్వా శర్మ.
రామ మందిరాన్ని నిర్మించ కూడదని కాంగ్రెస్ పార్టీ ఎనలేని కుట్రలు చేసిందన్నారు. రాముని దగ్గరకు రాక పోవడం మంచిదే అయిందన్నారు. వాళ్లు పాపం చేశారు..అందుకే పాపులుగా మిగిలి పోతారని అన్నారు సీఎం.