పులి కడుపున పులే పుడుతుంది
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఆమె నిప్పులు చెరిగారు. పులి కడుపున పులే పుడుతుందన్నారు. తాను వైఎస్ రక్తమన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా తాను మాజీ సీఎం బిడ్డేనని , ఆ విషయం ఉమ్మడి ఏపీ ప్రజలకు తెలుసన్నారు. తాను ఏ పదవి కోసమో కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు.
వైఎస్సార్ పాలనకు జగన్ రెడ్డి పాలనకు చాలా తేడా ఉందని ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి. జగన్ అన్నకు వైఎస్ కు భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత దూరం ఉందన్నారు. వైఎస్సార్ ఆనాడు జలయజ్ఞం పై ఫోకస్ పెట్టారని, ప్రాజెక్టులను కట్టారని, పొలాలకు నీళ్లు అందేలా చేశారని తెలిపారు.
కానీ జగన్ రెడ్డి ఏపీలో కొలువు తీరాక వీటిపై ఫోకస్ పెట్టలేదని ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి. తన తండ్రి హయాంలో 32 శాతం ప్రాజెక్టులు పూర్తి చేశామని , కానీ జగన్ వచ్చాక వాటిని పూర్తిగా పక్కన పెట్టారంటూ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా పేరుతో జనాన్ని మోసం చేశారంటూ చంద్రబాబు, జగన్ రెడ్డి పై మండిపడ్డారు వైఎస్ షర్మిల. తనను టార్గెట్ చేస్తూ లేనిపోని కామెంట్స్ చేస్తున్న వారికి తగిన రీతిలో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు.