పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
స్పీకర్ ప్రసాద్ కు ఎమ్మెల్సీ కవిత వినతి
హైదరాబాద్ – ఆధునిక భారత దేశ వైతాళికుడిగా, మహోన్నత మానవుడిగా గుర్తింపు పొందారు మహాత్మా జ్యోతిబా పూలే. ఈ దేశంలో తొలి ఉపాధ్యాయురాలిగా చరిత్రలో నిలిచి పోయారు జ్యోతిబా పూలే సతీమణి. ఆయనను ఆదర్శంగా తీసుకుని కోట్లాది మంది ప్రజల కోసం పని చేస్తున్నారు. భారత రాజ్యాంగ స్పూర్తి ప్రదాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను ప్రభావితం చేసిన ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే.
ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మహనీయుడైన జ్యోతి బా పూలే విగ్రహాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర శాసన సభ అధిపతి (స్పీకర్) గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయనకు పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినందించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పీకర్ గా కొలువు తీరడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. అంతకు ముందు తొలి శాసనసభ స్పీకర్ గా మధుసూధనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్వామి గౌడ్ పని చేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రసాద్ కుమార్ శాసన సభ అధిపతిగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో మంత్రిగా పని చేశారు.