పేదరిక నిర్మూలనే నా లక్ష్యం
నారా చంద్రబాబు నాయుడు
నిమ్మకూరు – పేదరిక నిర్మూలనే తన అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. అందుకే పూర్ టు రిచ్ ముఖ్య ఉద్దేశమన్నారు. సంపదను సృష్టించడం వాటిని పేదలకు పంపిణీ చేస్తామని చెప్పారు. నిమ్మకూరు గ్రామాన్ని ప్రపంచానికి అనుసంధానం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. తనకు 25 ఏళ్ల పాటు విజినరీ అనేది ఉంటుందన్నారు. మీరు సంపన్నులు అయ్యేందుకు మీరు గొప్పగా ఆలోచించాలని సూచించారు నారా చంద్రబాబు నాయుడు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించు కోవడం మానేసిందన్నారు. రాబోయే రోజుల్లో జగన్ రెడ్డికి జనం చుక్కలు చూపించడం ఖాయమని జోష్యం చెప్పారు. తమ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకున్నానని అన్నారు.
రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. అయితే తాను చెప్పినట్లు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బాబుదేనంటూ జగన్ మోహన్ రెడ్డి, ఆయన పరివారం పదే పదే బాబును టార్గెట్ చేస్తూ వచ్చారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాజీ సీఎంపై ఉందని గుర్తిస్తే బెటర్.