పేర్ని నాని కబ్జాలో కింగ్
నారా చంద్రబాబు నాయుడు
గుడివాడ – తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) ని ఏకి పారేశారు. మచిలీపట్నం ఎమ్మెల్యే నాని అక్రమాలకు అంతే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
పేర్ని నాని రోజూ అన్నం తింటాడో లేదో కానీ రోజూ కనిపించిన ప్రతి భూమిని కబ్జా చేస్తాడని ఆరోపించారు చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలకు పాల్పడడంలో కింగ్ మేకర్ గా మారాడని మండిపడ్డారు. అక్రమార్జనలో జగన్ మోహన్ రెడ్డిని మించి పోవాలని కలలు కంటున్నాడని, ఆ దిశగా లెక్కలేనంతగా సంపాదించాడని ఫైర్ అయ్యారు.
పేర్ని నాని ఇప్పుడు కొత్తగా తన కొడుకును పొలిటికల్ తెర పైకి తీసుకు వచ్చాడని , తను సంపాదించింది కాకుండా ఇంకో వైపు కొడుక్కిని కూడా భాగస్వామిగా చేశాడని అన్నారు చంద్రబాబు నాయుడు. బందరు పోర్టు పూర్తి కావాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతుందన్నారు. దానిని కొల్లు రవీంద్ర చూసుకుంటారని భరోసా ఇచ్చారు.
రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికలు పూర్తిగా నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్నాయని అన్నారు. ప్రజలు ఏమరుపాటుతో ఉండాలని, పని చేసే వారికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.