పొన్నంతో స్వామి గౌడ్ భేటీ
కాంగ్రెస్ లోకి వెళ్లే ఛాన్స్
హైదరాబాద్ – రాష్ట్రంలో రాజకీయాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆయా పార్టీలకు చెందిన నేతలు పక్క చూపులు చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంల కీలకమైన పాత్ర పోషించారు ఉద్యోగ సంఘాల నాయకుడు స్వామి గౌడ్. ఆయన స్పీకర్ గా కూడా పని చేశారు. ఒకప్పుడు కింది స్థాయిలో పని చేసిన ఆయన ఉన్నత స్థానంకు చేరుకున్నారు.
కేసీఆర్ తో విసిగి వేసారిన స్వామి గౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. అక్కడ కూడా ఇముడ లేక పోయారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న డాక్టర్ దాసోజ్ శ్రవణ్ తో కలిసి స్వామి గౌడ్ కూడా తిరిగి భారత రాష్ట్ర సమితి పార్టీ లోకి స్వంత గూటికి చేరుకున్నారు. ఆయనకు మాజీ మంత్రి కేటీఆర్ సాదర స్వాగతం పలికారు.
ఈ తరుణంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ కు బదులు కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్నాయి పార్టీలు. ఈ తరుణంలో బలమైన సామాజిక నేపథ్యం కలిగిన స్వామి గౌడ్ ఉన్నట్టుండి రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ ను తన నివాసంలో కలుసుకున్నారు. ప్రస్తుతం వైరల్ గా మారింది.
త్వరలోనే పార్టీని వీడి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు స్వామి గౌడ్.