పోర్టు కంటైనర్ మూసేస్తే ఊరుకోం
వీధిన పడనున్న 10 వేల మంది
నెల్లూరు జిల్లా – ఏపీ ప్రభుత్వం చేతకాని తనం వల్ల ప్రతిష్టాత్మకమైన నెల్లూరు జిల్లాకు తీరని ద్రోహం జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కొన్నేళ్ల పాటు కృష్ణ పట్నం పోర్టు కంటైనర్ విశిష్ట సేవలు అందించిందని అన్నారు. జగన్ రెడ్డి నిర్వాకం కారణంగా అది మూత పడనుందని , ఈ నెలాఖరు వరకల్లా క్లోజ్ అవుతుందని ధ్వజమెత్తారు.
కృష్ణ పట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ పై ఆధారపడి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మంది ఆధారపడి బతుకుతున్నారని, దీనిని మూసి వేస్తే , తమిళనాడుకు తరలిస్తే వీరంతా రోడ్లపైకి వస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీఈపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఏడాదికి రూ.1,000 కోట్ల రాష్ట్ర పన్ను కోల్పోతోందని చెప్పారు. ఇక నుంచి కృష్ణ పట్నం పోర్టులో మిగిలేది కేవలం డర్టీ కార్గో మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంటే ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
రైతుల త్యాగాలతో కృష్ణ పట్నం పోర్టు ఏర్పడిందన్నారు. తమిళనాడుకు తరలించే ప్రయత్నం చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరించారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ప్రకటించారు .