ప్రజా చైతన్యం కోసమే యాత్ర
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తాను భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టడం జరిగిందని అన్నారు ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. ఈనెల 14 నుంచి రెండో విడత యాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏఐసీసీ ఏర్పాట్లు చేసింది.
గతంలో దేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బిగ్ సక్సెస్ అయ్యింది. ఈ సందర్బంగా దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా ఇండియా కూటమిగా ఏర్పాటయ్యాయి.
6,000 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ యాత్ర చేపట్టనున్నారు రాహుల్ గాంధీ. ఈ సందర్బంగా యువజన కార్యకర్తలతో న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ ప్రజలకు వ్యతిరేకంగా పని చేస్తోందని ఆరోపించారు.
జనం కమల దళాన్ని భరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. గతంలో ఎన్నడూ లేని రీతిలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల తరపున గొంతు వినిపించేందుకు తాను భారత్ న్యాయ్ యాత్రను చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు రాహుల్ గాంధీ.