ప్రజా పాలనపై రేవంత్ ఫోకస్
ప్రత్యేకంగా వెబ్ సైట్ ఏర్పాటు
హైదరాబాద్ – తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ప్రజా పాలన ఎలా జరుగుతోందనే దానిపై సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ఇక హైదరాబాద్ లో 2 రోజుల పాటు మాత్రమే అవకాశం ఇచ్చింది సర్కార్.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇందులో భాగంగా 2 గ్యారెంటీలను అమలు చేసింది. వీటిలో ఒకటి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం. రెండో గ్యారెంటీ రైతు బంధును అమలు చేయడం. ఇంకా మిగిలి పోయిన 4 గ్యారెంటీలను త్వరితగతిన అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనపై ప్రత్యేకంగా వెబ్ సైట్ ను తయారు చేసింది. http://prajapalana.telangana.gov.inను ఇవాళ సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అంతకంటే ముందు ఈ నెల రోజుల పాలనపై కేబినెట్ తో కలిసి సమీక్ష చేపట్టనున్నారు.