ప్రజ్ఞానందకు అదానీ ప్రశంస
దేశానికి పేరు తీసుకు రావాలి
పిన్న వయసు లోనే అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ భారత దేశానికి ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకు వచ్చేలా చేసిన ఘనత తమిళనాడు రాష్ట్రానికి చెందిన చదరంగ ఆటగాడు ప్రజ్ఞానంద. ఇప్పటికే పలు అవార్డులు, పతకాలు పొందాడు. దేశం గర్వ పడేలా చేస్తున్నాడు.
ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మద్దతు ప్రకటించడం విశేషం. తాజాగా చదరంగ ఆటగాడు ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీని కలుసుకున్నాడు. ఈ సందర్బంగా ప్రత్యేకంగా ప్రజ్ఞానందను అభినందనలతో ముంచెత్తాడు.
అతడి విజయం అసంఖ్యాక భారతీయ యువకులకు స్పూర్తి దాయకంగా నిలుస్తుందని అనడంలో సందేహం లేదని పేర్కొన్నారు. ఇలాంటి యువతీ యువకులు మరింత ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు గౌతమ్ అదానీ.
రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అంతే కాదు చదరంగం అనేది జీవితంలో గెలవడానికి ఉపకరణగా , ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. తాను కూడా కష్టపడి పైకి వచ్చానని, ఒక్క రోజులో ఎవరూ విజేతలు , బిలియనీర్లు కాలేరని స్పష్టం చేశారు.