ప్రతీ పైసా ప్రజల కోసం ఖర్చు చేస్తాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ – రాష్ట్రానికి సంబంధించి ప్రతీ పైసాను ప్రజల కోసం ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలు, కార్యక్రమాల కోసం వినియోగిస్తామని చెప్పారు.
గతంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఆరోపించారు మల్లు భట్టి విక్రమార్క. ఫార్ములా ఈ రేస్ పై మాజీ మంత్రులు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఫార్ములా ఈ రేస్ పై సర్కార్ సరైన చర్యలు తీసుకోలేదని అంటున్నారని, ఈ రేస్ వెనక్కి వెళ్లడంతో నష్టం జరిగిందని ఎలా అంటారని ప్రశ్నించారు మల్లు భట్టి విక్రమార్క. వారు చేసిన విమర్శలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొన్నారు.
ఫార్ములా ఈ రేస్ పై ప్రజలందరికీ వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఫార్ములా ఈ రేస్ పేరుతో టికెట్లు అమ్ముకుని ఓ కంపెనీ లబ్ది పొందిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం. ఫార్ములా ఈ రేసులో ముగ్గురు వాటాదారులు ఉన్నారని , వారు ఎవరో, వారికి సంబంధించిన వివరాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు.