బాబుకు షర్మిల ఆహ్వానం
కొడుకు పెళ్లికి రావాలని పిలుపు
హైదరాబాద్ – వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వైఎస్ షర్మిల అందరినీ విస్తు పోయేలా చేశారు. ఆమె ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. తన కొడుకు తనయుడు పెళ్లికి సంబంధించి ఆహ్వానం అందజేశారు. ఈనెల 18న నిశ్చితార్థం ఉంటుందని తెలిపింది షర్మిల. వచ్చే నెల ఫిబ్రవరి 17న పెళ్లి జరుగుతుందని తప్పకుండా కుటుంబ సమేతంగా రావాలని ఆమె ఆహ్వానించారు.
వైఎస్ షర్మిల కీలకమైన నేతలను కలుసుకున్నారు. నిన్నటి దాకా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును కలిశారు. పెళ్లి పత్రిక అందజేశారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసానికి చేరుకున్నారు. తన తనయుడితో కలిసి వివాహ పత్రికను అందజేశారు.
వీరితో పాటు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ లో కలుసుకున్నారు. తప్పకుండా తన కొడుక్కి నిశ్చితార్థం, పెళ్లికి రావాలని కోరారు. ఇందుకు సంబంధించి తాను వస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా తన సోదరుడితో నిత్యం యుద్దం చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటికి స్వయంగా వెళ్లి ఇన్విటేషన్ ఇవ్వడం విస్తు పోయేలా చేసింది.