ANDHRA PRADESHNEWS

బాబు..ప‌వ‌న్ ను త‌రిమి కొట్టండి

Share it with your family & friends

పిలుపునిచ్చిన మంత్రి ఆర్కే రోజా

తిరుప‌తి – ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, తెలుగు వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. జ‌న‌సేన‌, టీడీపీ మేనిఫెస్టోల‌ను భోగి మంట‌ల్లో కాలుస్తున్నార‌ని అన్నారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

విచిత్రం ఏమిటంటే పండుగ రోజు నాడు స్థానికేతరులైన ఈ నాయ‌కులు ఇక్క‌డికి రావ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ప్ర‌జ‌లు చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను న‌మ్మే ప‌రిస్థితుల్లో లేర‌న్నారు ఆర్కే రోజా. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో త‌మ పార్టీ బాస్, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

భోగి, ఎన్నిక‌లు అయి పోగానే హైద‌రాబాద్ కు వెళ్లి పోతార‌ని , ప్ర‌జ‌ల‌ను మోసం చేస్త‌న్న చంద్ర‌బాబు , ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను త‌రిమి వేయాల‌ని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల‌లో నిర్వీర్యం చేసి అప్పుల పాలు చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కుతుంద‌న్నారు.

మాయ మాట‌లు చెప్ప‌డంలో, జ‌నం చెవుల్లో పూలు పెట్ట‌డంలో చంద్ర‌బాబు ఆరి తేరాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. తాము తిరిగి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.