బాబు ఫైబర్ నెట్ కేసు విచారణ
ముందస్తు బెయిల్ నిరాకరణ
న్యూఢిల్లీ – తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఏపీ సీఐడీ ఏకంగా ఎనిమిది కేసులు నమోదు చేసింది. ఆయన ఏపీ స్కిల్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ పై ఉన్నారు. ఇప్పటికే రాజమండ్రి జైలులో 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
స్కిల్ స్కాం కేసును భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తికి ధర్మాసనం బదిలీ చేసింది. తాజాగా ఇవాళ సుప్రీంకోర్టులో మరో కేసు విచారణకు రానుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుతో పాటు తనయుడు లోకేష్ బాబు కూడా చేర్చింది ఏపీ సీఐడీ.
ఇదిలా ఉండగా ఫైబర్ నెట్ కేసుపై హైకోర్టులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి బెయిల్ ఇవ్వడం కుదరదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును జస్టిస్ అనిరుధ్ బోస్ , జస్టిస్ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 17ఎపై స్పష్టత వచ్చిన తర్వాతే ఫైబర్ నెట్ కేసును విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.