బిల్కిస్ బానో కేసుపై సంచలన తీర్పు
గుజరాత్ సర్కార్ కు సుప్రీం బిగ్ షాక్
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన బిల్కిస్ బానో కేసుపై భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి జీవిత ఖైదీలను విడుదల చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.
దోషులను రిలీజ్ చేసేందుకు గుజరాత్ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం రాజ్యాంగ విరుద్దమని పేర్కొంది. బేషరతుగా విడుదలైన వారందరినీ తిరిగి జైలుకు పంపించాలని ఆదేశించింది. ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మోస పూరితమైన మార్గాల ద్వారా దీనిని పొందారంటూ మండిపడింది. ఈ మేరకు 2022 ఆర్డర్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులు తిరిగి జైలుకు వెళ్లేందుకు 2 వారాల గడువు ఇచ్చింది.
2002లో గోద్రాలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేయడమే కాకుండా చిన్నారులను చూడకుండా హత్యకు పాల్పడ్డారు. వీరిలో 11 మంది ఉన్నారు. వీరు గుజరాత్ సర్కార్ కు అప్పీలు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ జస్టిస్ అజయ్ రస్తోగీ ఇచ్చిన ఆర్డర్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.