బీజేపీ అంటే బాబుకు భయం
సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్
అమరావతి – సీపీఐ జాతీయ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. త్వరలో రాష్ట్రంలో శాసన సభ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. బలమైన జగన్ మోహన్ రెడ్డిని ఢీకొనాలంటే ఇప్పుడున్న పార్టీలకు శక్తి సరిపోదన్నారు
అందుకే టీడీపీ, జనసేనతో పాటు ఇంకొన్ని పార్టీలు కూడా కలిసి పని చేయాలని హితవు పలికారు. పోల్ మేనేజ్ మెంట్ చేయడంలో ఈ దేశంలో బీజేపీ నెంబర్ వన్ గా ఉందంటూ ఆరోపించారు. అందుకే ఆ పార్టీని చూసి చంద్రబాబు నాయుడు జంకుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఆయన నుంచి సగం ధైర్యాన్ని చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటే బెటర్ అన్నారు నారాయణ. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి కూటమిలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లేక పోతే సీఎంను ఢీకొనే సత్తా ఉందని తాను అనుకోవడం లేదన్నారు సీపీఐ నారాయణ.
ఇకనైనా చంద్రబాబు నాయుడు మారాలని సూచించారు సీపీఐ నారాయణ. ఇండియా కూటమితో కలిసి వచ్చే పార్టీలతోనే తాము ముందుకు వెళతామని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే మంచిదని సూచించారు