బీజేపీ హైకమాండ్ కు థ్యాంక్స్
స్పష్టం చేసిన మేకల శిల్పా రెడ్డి
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ తెలంగాణ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నగరానికి చెందిన డాక్టర్ మేకల శిల్పా సునీల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు , కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డికి, బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా, ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షా, ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి, మాజీ చీఫ్ బండి సంజయ్ కు ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ బలోపేతం చేసేందుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. తన పనిపై నమ్మకం ఉంచి బాధ్యతతో కూడిన పదవిని కట్టబెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు మేకల శిల్పా సునీల్ రెడ్డి.
ప్రస్తుతం మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు.
డాక్టర్ గా తాను పేదలకు వైద్యం అందజేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకురాలిగా, సామాజిక సేవకురాలిగా ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు డాక్టర్ మేకల శిల్పా రెడ్డి. హిందూ ధర్మ రక్షణ కోసం తాను పాటు పడతానని అన్నారు.
ఈనెల 22న జరిగే రామ మందిరం పునః ప్రారంభించే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుండి భారీ ఎత్తున తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.