భక్త సందోహం మకర జ్యోతి దర్శనం
శబరిమలలో అయ్యప్పల తాకిడి
శబరిమల – లక్షలాది మంది భక్తుల కొంగు బంగారంగా కొలిచే శబరిమల లోని అయ్యప్ప స్వామి ప్రాంగణం అయ్యప్పలతో దద్దరిల్లి పోయింది. కిలోమీటర్ల పొడవునా బారులు తీరారు అయ్యప్ప స్వాములు. స్వామియే శరణం అయ్యప్పా అంటూ నినదించారు. ఎక్కడ చూసినా భక్త బాంధవులే.
ప్రతి ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మకర జ్యోతి ద్వారా అయ్యప్ప దర్శనం ఇస్తారు. దీనిని చూసేందుకు భక్తులు నానా తంటాలు పడుతారు. దేశం నలుమూలల నుంచి అయ్యప్ప మాలలు వేసుకున్న వారంతా శబరిమలకు తరలి వస్తారు.
ఇవాళ పొన్నాంబలమేడు కొండపై అద్బుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షలాదిగా తరలి వచ్చారు. కేరళ ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. అయినా ఇబ్బందులు తప్పలేదు. స్వామి దర్శనం కోసం పోటెత్తారు. దీంతో తీవ్రమైన తొక్కిసలాట చోటు చేసుకుంది. దారి పొడవునా కిలోమీటర్ల మేర అయ్యప్పలు నిలిచే ఉన్నారు.
మకర జ్యోతి కోసం వారంతా వేచి ఉన్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్ర సర్కార్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. గత ఏడాది కంటే ఈసారి అయ్యప్ప స్వామి భక్తుల సంఖ్య పెరిగింది.