భగ్గుమన్న ఎమ్మెల్యే బాలినేని
చెప్పినోళ్లకు టికెట్లు ఇవ్వలేదు
అమరావతి – ఏపీ వైసీపీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక్కరొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. మరికొందరు పక్క చూపులు చూస్తున్నారు. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. ఎవరికి వస్తుందో రాదోనని. ఈ తరుణంలో బుధవారం ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన పరోక్షంగా పార్టీ చీఫ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై భగ్గుమన్నారు. తాను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదని ఆరోపించారు. సంతనూతలపాడు, కొండెపి నియోజకవర్గాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు చెప్పకుండానే ఇచ్చారంటూ మండిపడ్డారు.
అయితే అసంతృప్తితో రగిలి పోతున్నానని, రాజీనామా చేయడం ఎంతో సమయం పట్దదన్నారు బాలినేని. సమస్యలన్నీ సామరస్య పూర్వకంగానే సర్దుకుంటాయని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.
వైసీపీ అభ్యర్థులంతా గెలుపొందడం ఖాయమన్నారు. ఎర్రగొండపాలెం అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తనదన్నారు. ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డిని వదులు కోవడం ఇష్టం లేదన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.