భారత్ కు సంపూర్ణ మద్దతు
ప్రకటించిన ఫ్రాన్స్ చీఫ్ మాక్రాన్
న్యూఢిల్లీ – భారత దేశానికి సంపూర్ణ సహకారం అందజేస్తామని ప్రకటించారు ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యూయల్ మాక్రాన్. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ దేశానికి చెందిన సైనికుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇదే సమయంలో భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల శకటాలు ఇమ్మాన్యుయల్ ను విస్మయానికి గురి చేశాయి.
రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం ఇచ్చిన విందులో పాల్గొన్నారు. అక్కడ భారతీయ వంటకాలను రుచి చూశారు. సంతోష పడ్డారు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు. అక్కడి నుంచి నేరుగా ప్రధానమంత్రి మోదీతో కలిసి ఇమ్మాన్యుయల్ మాక్రాన్ తో కలిసి జైపూర్ కు వెళ్లారు.
అక్కడ చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. తెగ ముచ్చట పడ్డారు. ఇలాంటి గొప్ప సంస్కృతి ఉన్నందుకు తాను ఆనంద పడుతున్నానని పేర్కొన్నారు మాక్రాన్. ఇదిలా ఉండగా రెండో ప్రపంచ యుద్దం జ్ఞాపకార్థం పారిస్ లో ఒలింపిక్ , పారా ఒలింపిక్ , ఫ్రాంకో ఫోనీ సమ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వనుంది ఫ్రాన్స్. అయితే ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించేందుకు భారత దేశం కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు.