భారత్ లో రష్యా భారీ పెట్టుబడులు
అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటన
రష్యా – రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్న భారత దేశానికి, దేశ ప్రధాన మంత్రి దామోదర దాస్ మోదీకి , అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకు, 143 కోట్ల భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పుతిన్ చిట్ చాట్ ముచ్చటించారు.
కీలక అంశాలపై తన అభిప్రాయలు వెలిబుచ్చారు. భారత దేశానికి భారీ ఎత్తున రష్యా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టనుందని ప్రకటించారు రష్యా చీఫ్. తమకు ఇండియా మిత్ర దేశమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరంగా ఇరు దేశాలు కలిసి ముందుకు సాగుతాయని చెప్పారు.
ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రపంచం లోనే అత్యధిక ఆర్థికాభివృద్ది, వృద్ది రేటులో భారత దేశం ఒకటి అని తెలిపారు. ఇండియా స్వతంత్ర విదేశాంగా విధానాన్ని అనుసరిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇది సాధ్యమయ్యే అంశం కాదన్నారు.
కానీ ఈ విషయంలో ఇండియా సర్కార్ అద్భుత విజయాన్ని సాధించిందని పుతిన్ కొనియాడారు.