మణిపూర్ పై మోదీ వివక్ష
నిప్పులు చెరిగిన రాహుల్
మణిపూర్ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. ఒక బాధ్యత కలిగిన ప్రధాన మంత్రి పదవిలో ఉన్నా ఎందుకని మణిపూర్ పై వివక్ష చూపిస్తున్నారంటూ ప్రశ్నించారు.
తాను చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్ లో సాగుతోంది. అక్కడి ప్రజలు తమ సమస్యల గురించి రాహుల్ గాంధీతో ఏకరవు పెట్టారు. మరికొందరు తనకు సమస్యలతో కూడిన వినతిపత్రాలను సమర్పించారు. ఈ సందర్బంగా చిన్నారులు, ఇతరులతో రాహుల్ ముచ్చటించారు.
గత ఏడాది జూన్ 29న తాను మణిపూర్ ను సందర్శించానని , ఆ సమయంలో తాను చూసినవి, విన్నవి ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదన్నారు. వినలేదంటూ స్పష్టం చేశారు. 2004 నుంచి రాజకీయాలలో ఉన్నానని , తాను తొలిసారిగా దేశంలోని బీజేపీ సర్కార్ ప్రభుత్వం అనే సంస్థను నాశనం చేసిన రాష్ట్రానికి వెళ్లానని పేర్కొన్నారు.
మణిపూర్ వివక్షకు లోనైంది. అంతకు మించి అన్యాయానికి గురైంది. అంతులేని విధ్వంసానికి చిరునామాగా మారి పోయింది. కానీ తాను ఇప్పటి దాకా మిమ్మల్ని కనీసం పరామర్శించేందుకు రాలేక పోవడం దారుణం అన్నారు రాహుల్ గాంధీ.