మయన్మార్ కు షా స్ట్రాంగ్ వార్నింగ్
దేశంలోకి అక్రమంగా వస్తే ఒప్పుకోం
న్యూఢిల్లీ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా షాకింగ్ కామెంట్స్ చేశారు. మయన్మార్ దేశంపై నిప్పులు చెరిగారు. ఆ దేశం నుంచి భారత దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారని, దీనిని తమ సర్కార్ క్షమించదని స్పష్టం చేశారు.
దేశంలోకి ప్రవేశిస్తున్న వారిని అడ్డుకుని తీరుతామన్నారు అమిత్ షా. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా దొడ్డి దారిన ఇండియాలోకి ప్రవేశిస్తున్నారని దీనిని ఒప్పుకోబోమంటూ కుండ బద్దలు కొట్టారు కేంద్ర మంత్రి.
యధేశ్చగా, ఇష్టానుసారం రాక పోకలు సాగిస్తుండడాన్ని గమనిస్తున్నామని, ఈ విషయంపై కేంద్రం పునరాలోచిస్తోందన్నారు అమిత్ షా. బంగ్లాదేశ్ దేశానికి సంబంధించి ఎలా వ్యవహరిస్తున్నామో మయన్మార్ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
అయితే ప్రస్తుతం మయన్మార్ లో అంతర్యుద్దం కొనసాగుతోందన్నారు. అక్కడ సైన్యానికి తిరుగుబాటు దారులకు మధ్య యుద్దం జరుగుతోందని, సైనికులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు సరిహద్దులు దాటి ఇక్కడికి వస్తున్నారని వెల్లడించారు కేంద్ర హోం శాఖ మంత్రి.