మహేష్ మామూలోడు కాదు
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
గుంటూరు – ప్రిన్స్ మహేష్ బాబు మామూలోడు కాదంటూ ప్రశంసల వర్షం కురిపించారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గుంటూరులో జరిగిన గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలలో దర్శకుడు పాల్గొని ప్రసంగించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు అరుదైన నటుడని పేర్కొన్నారు.
ప్రతి దర్శకుడు కోరుకునే నటుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ప్రిన్స్ లో ఉన్నాయని అన్నారు. మహానుభావుడు దివంగత కృష్ణ అని గుర్తు చేసుకున్నారు. చాలా మంది హీరోలు 100 శాతం తమ నటనపై ఫోకస్ పెడితే మహేష్ బాబు మాత్రం 200 శాతం దృష్టి సారిస్తారని, సీన్ అయిపోయేంత వరకు తను అక్కడే ఉంటాడని చెప్పారు త్రివిక్రమ్ శ్రీనివాస్.
మహేష్ బాబుతో తన జర్నీ అనూహ్యంగా మొదలైందని అన్నారు. తామిద్దరం కలిసి చేసిన అతడు ఇప్పటికీ ఎప్పటికీ నిలిచే ఉంటుందని స్పష్టం చేశారు. బుల్లి తెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిందన్నారు దర్శకుడు. తర్వాత ఖలేజా తీశానని, అది కూడా హిట్ అయ్యిందని, ఇప్పుడు కొత్త పాత్రలో మహేష్ బాబును గుంటూరు కారం ద్వారా పరిచయం చేశానని అన్నారు.
తప్పకుండా ఆదరించాలని, ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.