మూడేళ్ల తర్వాత ఢిల్లీలో శకటం
సీఎం రేవంత్ చొరవతో ప్రారంభం
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక సీన్ మారింది. అన్ని శాఖలపై ఆయన వస్తూనే రివ్యూ చేశారు. సాధ్య సాధ్యాలను, లోటు పాట్లను గుర్తించారు. చాలా మంది అధికారులను మార్చారు. వస్తూనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విస్తు పోయేలా చేశారు.
గతంలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ కేంద్రంతో నువ్వా నేనా అంటూ పేచీకి దిగింది. దీంతో పనులకు ఆటంకం ఏర్పడింది. నిధులు రాకుండా పోయాయి. దీనిని ముందే గమనించారు రేవంత్ రెడ్డి. ఆయన నేరుగా ప్రధాన మంత్రి మోదీని , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలుసుకున్నారు.
పనిలో పనిగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇదే సమయంలో ఏపీతో తాము కలిసి మెలిసి ఉంటామని, మీ సహకారం కూడా కావాలంటూ విన్నవించారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రితో కీలక విషయాన్ని పంచుకున్నారు సీఎం. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన శకటాన్ని ప్రదర్శించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
ఇందుకు కేంద్రం ఒప్పుకుంది. దీంతో రిహార్సల్స్ ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి చొరవను అందరూ ప్రశంసిస్తున్నారు.