మేం తల్చుకుంటే బీఆర్ఎస్ ఖాళీ
నిప్పులు చెరిగిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, కేటీఆర్ లను ఏకి పారేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. చిల్లర మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.
బావా బావమరుదులకు పని లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. పదే పదే నోటికి వచ్చినట్లు అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ప్రజలు ఏరికోరి తమకు అందలం ఎక్కించారని, తాము ఎవరినీ మోసం చేసి పవర్ లోకి రాలేదన్న విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ప్రభుత్వం పడి పోతుందంటూ కామెంట్స్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రజాస్వామ్యయుతంగా పని చేస్తున్నామని, కానీ ఇంకా అధికారంలో ఉన్నామని కేటీఆర్, హరీశ్ రావు భావిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే తాము చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.
ఒకవేళ తాము గనుక ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడితే గులాబీ పార్టీ ఖాళీ కావడం ఖాయమని జోష్యం చెప్పారు.