మోదీపై కామెంట్స్ కలకలం
మాల్దీవుల ప్రభుత్వం స్పందన
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాదరణ కలిగిన నేతలలో ఒకడిగా గుర్తింపు పొందారు భారత దేశానికి చెందిన ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఆయనపై అవమానకర రీతిలో మాల్దీవులకు చెందిన మంత్రి కామెంట్స్ చేయడం చర్చకు దారి తీసింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో మాల్దీవుల ప్రభుత్వం రంగంలోకి దిగింది. అది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, దానితో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.
మోదీపై మాల్దీవుల మంత్రి మరియం షియునా తీవ్ర విమర్శలు గుప్పించింది. చేసిన వ్యాఖ్యల గురించి తమకు సంబంధం లేదంటూ కుండ బద్దలు కొట్టింది మాల్దీవుల ప్రభుత్వం. తాము మోదీతో, భారత దేశంతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నామని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా ఆ దేశ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఏ దేశమైనా ఇతర దేశం పట్ల సహృదయతతో వ్యవహరించాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు లేదు. బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న వారు మాట్లాడే ముందు జాగ్రత్తగా , ఆచి తూచి మాట్లాడాలని పేర్కొంది. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అభిప్రాయ పడింది.