NEWSTELANGANA

మోదీ..రేవంత్ ఇద్ద‌రూ ఒక్క‌టే

Share it with your family & friends

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైద‌రాబాద్ – ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి ఇద్ద‌రూ ఒక్క‌టేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్. ఆదివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఆయ‌న ప్రసంగించారు. ఇద్ద‌రూ క‌లిసి రాష్ట్రంలో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీని లేకుండా చేయాల‌ని ప్లాన్ చేశార‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇటీవ‌లే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లార‌ని ఈ సంద‌ర్బంగా మోదీ ఆప‌రేష‌న్ కు తాను స‌హ‌క‌రిస్తాన‌ని కూడా చెప్పిన‌ట్లు త‌న‌కు స‌మాచారం అందింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు చేసినా బీఆర్ఎస్ ను ఎవ‌రూ అంతం చేయ‌లేర‌న్నారు. ఈ దేశంలో ఏ పార్టీకి లేనంత‌టి క్యాడ‌ర్ ఒక్క త‌మ పార్టీకి మాత్ర‌మే ఉంద‌న్నారు కేటీఆర్. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు. బీజేపీ మాజీ చీఫ్‌, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ తో పాటు ఏబీఎన్ ఎడిట‌ర్ చేసిన వ్యాఖ్య‌లు , రాత‌లు ఇందుకు మ‌రింత బ‌లాన్ని చేకూర్చేలా అనుమానం క‌లుగుతోంద‌న్నారు.

పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ధైర్యంగా ఉండాల‌ని అన్నారు. మైనార్టీల్లో ఉన్న అపోహ‌లు తొల‌గించాల‌ని సూచించారు. నిజాలు మాట్లాడ‌టం, క‌రెంట్ బిల్లులు క‌ట్టొద్ద‌ని చెప్ప‌డం త‌ప్పు ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు కేటీఆర్.