యూపీ సీఎం భావోద్వేగం
రామ మందిరం అద్భుతం
ఉత్తర ప్రదేశ్ – యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో ఇదో అపురూపమైన క్షణంగా, ఘట్టంగా నిలిచి పోతుందని పేర్కొన్నారు. తన సారథ్యంలో అయోధ్యలో రామ మందిరం నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. అంతే కాదు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
యావత్ ప్రపంచం కళ్లప్పగించి చూసిందని, కోట్లాది మంది రామ మందిరం పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని మనసారా వీక్షించారని, తన్మయత్వానికి లోనయ్యారని ఇంతకంటే ఇంకేం కావాలని పేర్కొన్నారు. ఇవాళ యోగి ఆదిత్యానాథ్ తన అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు. స్వయంగా మోదీ శ్రీరాముడికి తిలకం దిద్దారు. అనంతరం దీపం ముట్టించారు. శాస్త్ర పరంగా పూజలు చేశారు.
ఇదిలా ఉండగా ఈ ఆలయ నిర్మాణానికి 500 ఏళ్లు పట్టింది. శ్రీరాముడిని అయోధ్యలోని రామాలయంలో పునః ప్రతిష్టించడం దేశానికే గర్వ కారణమని పేర్కొన్నారు యోగి ఆదిత్యానాథ్. ఇది సాంస్కృతిక శ్రేయస్సుకు నాంది పలికిందని తెలిపారు.