యూపీ సీఎం వెరీ స్పెషల్
కమిట్ అయితే వదలడు
ఉత్తర ప్రదేశ్ – యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ మరోసారి వైరల్ గా మారారు. తను ఒక్కసారి కమిట్ అయ్యాడంటే ఇక వెనుదిరిగి చూడరు. ఇది ఆయన ప్రత్యేకత. తాజాగా అయోధ్యలో రామ మందిరం పునః నిర్మాణం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు సీఎం. ఇదంతా తన భుజాల మీద మోశాడు. కోట్లాది మంది ఈ పవిత్ర ప్రోగ్రామను కనులారా వీక్షించారు.
ఇదంతా పక్కన పెడితే ఆయన నిజమైన యోగి లాగా జీవిస్తారు. ఎక్కడా ఎవరినీ దరి చేరనీయరు. ఆయన కు అన్ని రంగాలలో ప్రావీణ్యం ఉంది. యోగి ఆదిత్యానాథ్ అసలు పేరు అజయ్ మోహన్ బిష్త్ . గర్వాల్ యూనివర్శిటీలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నాడు. గణితంలో ఘనా పాఠి. బీఎస్సీలో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు.
యూపీలోని పంచూర్ ఆయన స్వస్థలం . 1972లో పుట్టాడు. పేద కుటుంబం. ప్రస్తుతం 51 ఏళ్లు. మల్ల యుద్దంలో నేర్పరి. ఏక కాలంలో నలుగురిని ఓడించిన రికార్డు యోగి స్వంతం. నదులను ఈదిన మొనగాడు. ప్రముఖ గణిత శాస్త్ర నిపుణురాలు శకుంతలాదేవి మెచ్చుకున్న వ్యక్తి సీఎం. రోజుకు నాలుగు గంటల పాటు మాత్రమే నిద్ర పోతాడు యోగి.
యోగ, ధ్యానం , హారతి ఇవ్వడం తన దిన చర్య. పూర్తిగా శాఖహారి. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్పత్రికి వెళ్లలేదు. వన్య ప్రాణి శిక్షకులలో ఒకడు. వన్య ప్రాణులంటే చచ్చేంత ఇష్టం. ఆయన పేరుతో ఒకే ఒక్క ఖాతా ఉంది. ఎలాంటి ఆస్తులు లేవు. ఖర్చులు పోను సహాయ నిధిలో జమ చేస్తారు. ఒక రకంగా బీజేపీలో ఆయన వెరీ వెరీ స్పెషల్. దటీజ్ యోగి ఆదిత్యానాథ్.