యోగితో హనుమాన్ టీం భేటీ
అభినందించిన యూపీ సీఎం
ఉత్తరప్రదేశ్ – తెలుగు సినిమా రంగానికి చెందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ చిత్రం ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. ఇప్పటికే రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా మరికొన్ని కలెక్షన్లు సాధించేందుకు ముందుకు వెళుతోంది.
ఇదే సమయంలో తమ సినిమాకు సంబంధించి అమ్మిన ప్రతి టికెట్ పై రూ. 5 అయోధ్య లోని రామ మందిరం ట్రస్టుకు ఇస్తామని సినిమా రిలీజ్ సందర్బంగా ప్రకటించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆయన చెప్పిన వ్యాఖ్యలు మరింత వైరల్ గా మారాయి.
ఇటు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశమంతటా జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో థియేటర్లు దద్దరిల్లాయి. ఇదే సమయంలో యూపీలోని అయోధ్యలో రామ మందిరం పునః ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశంలోని సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
హనుమాన్ విజయం సాధించడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరా తీశారు. ఈ మేరకు సీఎంను కలుసుకున్నారు హనుమాన్ చిత్రానికి చెందిన హీరో, దర్శకుడు. వారిని ప్రత్యేకంగా అభినందించారు యోగి ఆదిత్యానాథ్.