రమణ గాడు గుర్తుండి పోతాడు
గుంటూరు కారంపై మహేష్ కామెంట్స్
దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారంపై వ్యతిరేక ప్రచారం భారీ ఎత్తున ఉన్నప్పటికీ సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగుతోంది. ఓ వైపు ఈ చిత్రానికి పోటీగా హనుమాన్ కూడా విడుదలైంది.
ఇది పక్కన పెడితే త్రివిక్రమ్ తో కలిసి మహేష్ బాబు నటించిన సినిమాలలో ఇది అత్యంత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు ప్రిన్స్. అతడు, ఖలేజా తర్వాత వచ్చిన ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారని, వాటికి తగ్గట్టుగానే తాను ప్రయత్నం చేశానని చెప్పారు.
తనపై ఎంతగా నెగటివ్ గా క్యాంపెయిన్ చేసినా తాను పట్టించుకోనని స్పష్టం చేశారు మహేష్ బాబు. తన సినీ కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకంగా గుర్తుండి పోతుందన్నారు. ఇందులో డైలాగులు, డ్యాన్సులలో తనకు కొత్తగా అనిపించేలా చేసిందన్నారు ప్రిన్స్.
తన కో స్టార్ శ్రీలీలతో కలిసి డ్యాన్సులు చేయడం విస్తు పోయేలా చేసిందన్నారు. ఆమె చాలా స్పీడ్ అని. తాను ఊహించ లేదన్నాడు మహేష్ బాబు. త్రివిక్రమ్ తో తనకు దగ్గరి అనుబంధం ఉందన్నారు. 14 ఏళ్ల తర్వాత నటించడం కొత్తగానే ఉంటుందన్నారు. మాటలు రాయడంతో తనకు తానే సాటి అని పేర్కొన్నారు.
ఇవాళ గుంటూరు కారం విజయం సాధించిన సమయంలో తన తండ్రి నట శేఖర కృష్ణ లేక పోవడం బాధ కలిగిస్తోందన్నారు మహేష్ బాబు.