రాజ్ భవన్ కళకళ
ఎట్ హోమ్ లో సీఎం..మంత్రులు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పాలనా పరంగా కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. భారత రాజ్యాంగం స్పూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సారథ్యంలోని రాజ్ భవన్ లో ఎట్ హోమ్ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు.
గతంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం గవర్నర్ ను అనరాని మాటలు అన్నది. ఆమెను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది. ఒకానొక దశలో ఆమెకు వాహనాన్ని కూడా ఇచ్చేందుకు నిరాకరించింది. అప్పట్లో ఈ అంశం తీవ్ర చర్చకు దారి తీసేలా చేసింది. దేశ వ్యాప్తంగా కేసీఆర్ తీరును ఎండగట్టారు. పూర్తి అహంకార పూరిత ధోరణితో వ్యవహరించారు.
పదేళ్ల పాటు దొర పాలన సాగించింది కల్వకుంట్ల కుటుంబం. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బండ కేసి కొట్టారు జనం. ఈ తరుణంలో సీన్ మారింది. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి రాజ్యాంగ బద్దంగా, ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇదే స్పూర్తి రాజ్ భవన్ లో కనిపించింది. రేవంత్ తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అక్కడంతా నవ్వులే విర బూశాయి.