రాముడి జీవితం స్పూర్తి దాయకం
స్పష్టం చేసిన వ్యాపార వేత్త అదానీ
ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త అదానీ సంస్థల గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని రామాలయంలో శ్రీరాముడు కొలువు తీరడం సంతోషానికి గురి చేసిందని తెలిపారు. ఈ సందర్బంగా తన మనసులోని మాటలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
500 ఏళ్ల పాటు దీని కోసమే నిరీక్షించడం , ఇవాళ అది మన కనుల ముందు ఆవిష్కరించ బడటం మరింత సంతోషాన్ని కలుగ చేస్తోందని తెలిపారు గౌతమ్ అదానీ. శాంతికి, సామరస్యానికి, నీతికి, నిజాయితీకి, ధర్మ బద్దమైన పాలనకు శ్రీరాముడు ప్రతీక అని స్పష్టం చేశారు.
భారత దేశ చరిత్రలో 22 జనవరి 2024 ఒక చిరస్మరణీయమైన రోజుగా ఎల్లప్పటికీ గుర్తుండి పోతుందని స్పష్టం చేశారు గౌతమ్ అదానీ. అయోధ్య తలుపులు తెరుచు కోవడం కోట్లాది మందికి మరింత ఆనందాన్ని కలుగ చేస్తుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి రామాలయం నాంది పలుకుతుందని తెలిపారు గౌతమ్ అదానీ. ఇది మన దేశానికి నిజంగా గర్వ కారణంగా నిలుస్తుందనడంలో సందేహం లేదన్నారు దిగ్గజ వ్యాపారవేత్త.