NATIONALNEWS

రాముడి స‌న్నిధిలో చంద్ర‌బాబు

Share it with your family & friends

రామాల‌యానికి ట్ర‌స్టు ఆహ్వానం

ఉత్త‌ర ప్ర‌దేశ్ – దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన క్ష‌ణం రానే వ‌చ్చింది. ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన యూపీలోని అయోధ్య‌లోని రామాల‌య ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు . ఆయ‌న‌తో పాటు ప్ర‌ముఖ న‌టుడు ర‌జ‌నీకాంత్ పాల్గొన్నారు.

రామ జ‌న్మ భూమి ట్ర‌స్టు దేశంలోని 7,000 మందికి పైగా ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించింది. యావ‌త్ ప్ర‌పంచం ఇప్పుడు అయోధ్య వైపు చూస్తోంది. ఇక మ‌య‌న్మార్ లో ప్ర‌వాస భార‌తీయులు భారీ ఎత్తున ర్యాలీ చేప‌ట్టారు. దీంతో అక్క‌డి స‌ర్కార్ విస్తు పోయింది.

ఇక అయోధ్య పూర్తిగా భారీ భ‌ద్ర‌త మ‌ధ్య చిక్కుకుంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఎక్క‌డ చూసినా సెక్యూరిటీ నిండి పోయింది. బ‌ల‌గాలు భారీగా మోహ‌రించాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ఎపీ, భ‌జ‌రంగ్ ద‌ళ్ కు చెందిన ప్ర‌తినిధులు , కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు.

సినీ, క్రీడా, వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు బారులు తీరారు అయోధ్య‌కు. ఎక్క‌డ చూసినా జై శ్రీ‌రామ్ పేరుతో నినాదాలు మిన్నంటాయి.