రాహుల్ జోడో యాత్ర బక్వాస్
నిప్పులు చెరిగిన కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీపై భగ్గుమన్నారు. ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర బక్వాస్ అంటూ కొట్టి పారేశారు. ఎవరూ ఆదరించడం లేదని ఆరోపించారు.
ఇదే సమయంలో ఆయన దేశం కోసం యాత్ర చేపడుతుంటే ఇండియా కూటమిలోని పార్టీలన్నీ వీడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. వారంతా రాహుల్ గాంధీని లీడర్ గా ఒప్పుకోవడం లేదన్నారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు.
రాహుల్ గాంధీ లీడర్ కానే కాడని, కేవలం మాట్లాడేందుకు మాత్రమే పనికి వస్తాడంటూ మండిపడ్డారు కేటీఆర్. ఇప్పటి దాకా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారంటూ ఆరోపించారు. ఎవరూ కూడా కాంగ్రెస్ ను పట్టించు కోవడం మానేశారంటూ పేర్కొన్నారు కేటీఆర్.
పాలన చేత కాకుండా తమపై ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు . ప్రజలు ఇప్పటికీ తమనే ఆదరిస్తున్నారని , త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని జోష్యం చెప్పారు కేటీఆర్.