NATIONALNEWS

రిల‌య‌న్స్ ఉద్యోగులంద‌రికీ సెల‌వు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన చైర్మ‌న్ ముకేష్ అంబానీ

ముంబై – రిల‌య‌న్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని అయోధ్య రామ మందిరం పునః ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం జ‌న‌వ‌రి 22న ఉండ‌డంతో ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.

అంతే కాకుండా రామ మందిరం ట్ర‌స్టు ఇప్ప‌టికే దేశంలోని 7000 మందికి పైగా ప్ర‌ముఖుల‌కు ఆహ్వానాలు అంద‌జేసింది. ఇందులో ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. అంబానీతో పాటు టాటా గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ ర‌త‌న్ టాటా, మ‌హీంద్రా గ్రూప్ ఆఫ్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా కూడా హాజ‌రవుతున్నారు.

వీరితో పాటు ప్ర‌ముఖ క్రికెట‌ర్లు స‌చిన్ టెండూల్క‌ర్, క‌పిల్ దేవ్ , విరాట్ కోహ్లీ, ర‌వీంద్ర జ‌డేజా కూడా పాల్గొన‌నున్నారు. ఇదిలా ఉండ‌గా రిల‌య‌న్స్ సంస్థ‌ల అధిప‌తి ముఖేష్ అంబానీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అయోధ్య రామ మందిరం అన్న‌ది యావ‌త్ భార‌త దేశానికి గ‌ర్వ కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు.

ఈ అద్భుతమైన కార్య‌క్ర‌మానికి త‌మ వంతు బాధ్య‌త‌గా భావిస్తూ ప్ర‌తి ఒక్క‌రూ రాముడిని పూజించాల‌నే ఉద్దేశంతో త‌మ సంస్థ‌కు చెందిన ఉద్యోగులంద‌రికీ సెల‌వు ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు .