రెసిడెన్షియల్ స్కూళ్లను బలోపేతం చేయాలి
హార్వర్డ్ యూనివర్శిటీ బృందానికి సీఎం సూచన
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలను అభివృద్ది చేసేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అమెరికాలో అత్యంత పేరు పొందిన హార్వర్డ్ యూనివర్శిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
ఇదిలా ఉండగా ఉస్మానియా యూనివర్శిటీలో ఈనెల 7వ తేదీ నుండి ప్రోగ్రాం ఫర్ సైంటిఫిక్ ఇన్స్పైర్డ్ లీడర్ షిప్ (పీఎస్ఐఎల్-24 ) పేరుతో శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ విషయం గురించి విశ్వ విద్యాలయ బృందం రేవంత్ రెడ్డికి వివరించారు.
ఈ సందర్బంగా సీఎం బృందానికి పలు సూచనలు చేశారు. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం , సుసంపన్నం చేసేందుకు ఏడాది పాటు విద్యా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతుగా సహకారం అందించాలని హార్వర్డ్ యూనివర్శిటీ అధ్యాపక బృందాన్ని కోరారు.
హార్వర్డ్ యూనివర్శిటీ బృందం 33 జిల్లాలలోని 40 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల టీచర్లకు , 100 మంది విద్యార్థులకు పీఎస్ఐఎల్ -24 పేరుతో 5 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. వీరికి ఇందులో శిక్షణ ఇస్తోంది.