రేపటి నుంచి షర్మిల ప్రచారం
జిల్లాల పర్యటనకు శ్రీకారం
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ గా నియమితులైన వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పవర్ లోకి తీసుకు వచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని శపథం చేసింది. ఇందులో భాగంగా పార్టీ దూకుడు పెంచింది. ఈ మేరకు ప్రచార కార్యక్రమానికి సంబంధించి రోడ్ మ్యాప్ సిద్దం చేసింది.
ఇందులో భాగంగా జనవరి 23 మంగళవారం నుంచి ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుట్టి రానున్నారు. తొలి సభ ఇచ్చాపురం నుంచి ప్రారంభం కానుంది. ఇడుపుల పాయతో ముగుస్తుంది.
ఎన్నికల ప్రచారానికి సంబంధించి టూర్ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. 23న శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలలో పర్యటిస్తారు వైఎస్ షర్మిలా రెడ్డి. 24న విశాఖ, అల్లూరు సీతారామ రాజు , అనకాపల్లి జిల్లాలలో , 25న కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో పర్యటిస్తారు .
25న ఏలూరు, ఈస్ట్ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలు, 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు, 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో క్యాంపెయిన్ చేపడతారని పార్టీ తెలిపింది. 29న తిరుపతి , చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, 30న శ్రీ సత్యసాయి , అనంతపురం, కర్నూలు జిల్లాలు, 31న నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాలలో పర్యటిస్తారని పేర్కొంది.