రేవంత్ తో అక్బరుద్దీన్ ములాఖత్
కాంగ్రెస్ సర్కార్ కు మద్దతుపై చర్చ
లండన్ – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. తన ప్రభుత్వాన్ని పదే పదే అస్థిర పరిచి, పడగొట్టేందుకు వ్యూహాలు పన్నుతున్న బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా తమ పార్టీలోకి ఎవరు వచ్చినా వారికి స్వాగతం పలికేందుకు సిద్దంగా ఉన్నామంటూ సంకేతాలు పంపించారు. ఈ ప్రక్రియ లోక్ సభ ఎన్నికల కంటే ముందే జరగనుందని సమాచారం.
ఇందులో భాగంగా ఇప్పటికే బలమైన సామాజిక వర్గానికి చెందిన మాజీ స్పీకర్, తెలంగాణ ఉద్యమ నాయకుడు స్వామి గౌడ్ తాజాగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరో వైపు స్వయంగా మంత్రి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తో ములాఖత్ కావడం కలకలం రేపింది.
ఇదిలా ఉండగా తాజాగా లండన్ టూర్ లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో అక్కడే ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సీఎంతో ములాఖత్ అయ్యారు. వీరిద్దరూ రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతానికి ఎంఐఎం పార్టీకి 7 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఉండగా మిత్రపక్షమైన సీపీఐ ఒక స్థానంతో ఉంది. దీంతో 65 స్థానాలతో పాటు ఎంఐఎం మద్దతు ఇస్తే 72 సీట్లు అవుతాయి. అందుకే ఈ ఇద్దరు సమాలోచనలు జరిపినట్లు సమాచారం.