రేవంత్ రెడ్డి ఓ క్రిమినల్ – కేటీఆర్
ఏం చేసుకుంటారో చేసుకోండి
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయన ఓ క్రిమినల్ అని, కరుడు గట్టిన దొంగ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారంటూ ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఛలో నల్లగొండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
కృష్ణా నది బేసిన్ లో ఉన్న హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని గౌరవ ప్రతినిధులతోని సమావేశం నిర్వహించామన్నారు. ఈ నెల 13 న చలో నల్గొండ సభ ను విజయవంతం చేయడం పై కృష్ణ బేసిన్ లో ఉండే జిల్లాల ప్రజలు నాయకులు కదిలి రావాలని పిలుపునిచ్చారు.
అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వెళ్లినా తమకు అభ్యంతరం లేదన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం గురించి ఎలాంటి అవగాహన లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని బరాజులు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌస్ లు ఉన్నాయి అనే అంశాలను బరా బర్ తెలుసు కోవచ్చన్నారు కేటీఆర్.