రోహత్..అజ్జూ భాయ్ వైరల్
ఉప్పల్ స్టేడియంలో ముచ్చట
హైదరాబాద్ – భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్ వైరల్ గా మారారు. భారత్ , ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య కీలకమైన టెస్టు మ్యాచ్ కు వేదికైంది హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం. ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేసింది.
మరో వైపు కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ పూర్తి సహకారం అందించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ బడులలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా మ్యాచ్ ను చూసేందుకు అవకాశం కల్పించింది సంస్థ. మొత్తం 25,000 కాంప్లిమెంటరీ కాపీలతో పాటు ఉచితంగా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయనుంది.
ఇదిలా ఉండగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మర్యాద పూర్వకంగా అజహరుద్దీన్ తో భేటీ అయ్యారు. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. భారత క్రికెట్ రంగంలో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా గుర్తింపు పొందారు అజహరుద్దీన్. తన సారథ్యంలోనే సచిన్, ద్రవిడ్ , గంగూలీ, కుంబ్లే, శ్రీనాథ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు తామేమిటో ప్రూవ్ చేసుకున్నారు