రోహన్ బోపన్నకు మోదీ కితాబు
విజయానికి వయసు అడ్డంకి కాదు
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పనిలో విజయం సాధించాలంటే వయస్సుతో సంబంధం లేదని పేర్కొన్నారు. చారిత్రాత్మకమైన ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను భారత దేశానికి చెందిన క్రీడాకారుడు రోహన్ బోపన్న చేజిక్కించుకున్నాడు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి స్పందించారు.
ట్విట్టర్ వేదికగా రోహన్ బోపన్న ప్రతిభను ప్రశంసించారు. ఇలాంటి క్రీడాకారులను యువ క్రీడాకారులు స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోదీ. వయస్సు అనేది శరీరానికే కానీ ఆటకు, మనసుకు కాదన్నారు.
తాను కూడా ఇలాంటి వారిని చూసి స్పూర్తి పొందుతానని స్పష్టం చేశారు. చేయాలన్న సంకల్పం, గెలుపు పొందాలన్న కసి ప్రతి ఒక్కరిలో ఉంటే దేనినైనా , ఎంతటి కష్టాన్నైనా, ఆటనైనా సులభంగా సాధించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు మోదీ.
ఈ సందర్బంగా రోహన్ బోపన్న రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు.