లక్షద్వీప్ ఎంపీ షాకింగ్ కామెంట్స్
పర్యాటక అభివృద్దికి వ్యతిరేకం
ఎన్సీపీకి చెందిన ఎంపీ ముహమ్మద్ ఫైజల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశ వ్యాప్తంగా లక్ష ద్వీప్ సంచలనంగా మారింది. ఇటీవల ఆ ప్రాంతాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. ఇక్కడి సౌందర్యాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి తన్మయత్వానికి లోనయ్యారు. అంతే కాదు బీచ్ లో కూడా స్నానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాన మంత్రి స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అవి నిమిషాల్లోనే వైరల్ గా మారాయి.
దీంతో ఛలో లక్షద్వీప్ అనే నినాదం ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దేశమంతటా లక్ష ద్వీప్ లో పర్యటించాలని కోరుకుంటున్నారు. దానిని హోరెత్తిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ప్రాంతానికి లోక్ సభ ఎంపీగా ఎన్సీపీ పార్టీ నుంచి మొహమ్మద్ ఫైజల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్సీపీలోకి జంప్ అయ్యారు. అయితే లక్ష ద్వీప్ లో ఎక్కువ మంది పర్యాటకులను అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కారణం ప్రకృతి, పర్యావరణం దెబ్బ తింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది పర్యాటకులు వస్తే లక్ష ద్వీప్ కు ఉన్న సహజ సౌందర్యం చెడి పోతుందని పేర్కొన్నారు.